ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కందుల జాహ్నవి కేసును అక్కడి పోలీసులు నీరుకార్చారు. జాహ్నవి మృతిని (jahnavi kandula) అవహేళన చేస్తూ మాట్లాడిన అమెరికా పోలీసు అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అధికారులు ప్రకటించారు. అతనిపై నేరాభియోగాలు మోపడానికి సరైన సాక్ష్యాలు లేవని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం తెలిపింది. సీనియర్ అటార్నీ విచారణ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కందుల జాహ్నవి ప్రమాదాన్ని అవహేళన చేస్తూ మాట్లాడి, ఆడియోలో అడ్డంగా దొరికిపోయినా,డవే మాత్రం ఆ సమయంలో అక్కడ లేరంటూ కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలిపారు. అడెరెరె వ్యాఖ్యలు మాత్రం అమోదయోగ్యం కాదన్నారు. అడెరెరె వ్యాఖ్యలు పోలీసులపై ప్రజల నమ్మకాన్ని తగ్గించేవిగా ఉన్నాయన్నారు.