వైసీపీకి
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
వైసీపీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో
పాటు జిల్లా అధ్యక్ష పదవిని కూడా వీడుతున్నట్లు పార్టీ అధినేత సీఎం జగన్కు లేఖ
రాశారు.
తన రాజీనామా నిర్ణయాన్ని తక్షణమే ఆమోదించాలని జగన్ను కోరారు. రాజ్యసభ
సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వేమిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత
కారణాల వల్లనే వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు.
నెల్లూరు
పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున వేమిరెడ్డి పోటీ చేస్తారని గతంలో ప్రచారం
జరిగింది. అయితే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో తన నిర్ణయాన్ని అధిష్టానం
పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన పార్టీ పై అసంతృప్తిగా ఉన్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు
సిటీ కో ఆర్డినేటర్ గా మహ్మద్ ఖలీల్ ను నియమించే
విషయంలో వేమిరెడ్డితో అధిష్టానం చర్చించకపోవడంతో ఆయన నొచ్చుకున్నారని స్థానికంగా
చర్చ జరుగుతోంది.