కృత్రిమ
మేధ (Artificial Intelligence) రంగంలో కీలకశక్తిగా ఎదగాలనే భారత్ కలలు త్వరలో సాకారమయ్యే సూచనలు
కనిపిస్తున్నాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐఐటీల సమన్వయంతో ఏర్పాటైన భారత్‌జీపీటీ
(Bharat GPT), త్వరలో చాట్‌జీపీటీ తరహా సేవలను ప్రారంభించనుంది.
దీనికి సంబంధించిన ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ను మంగళవారం ముంబయిలో ప్రదర్శించారు.
ఏఐ
బాట్‌తో ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడి సమాధానం రాబట్టగా ఓ బ్యాంకర్ హిందీలో చాట్
చేశాడు. హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంప్యూటర్ కోడ్‌ను
రాసేందుకు ఈ మోడల్ ను వినియోగించాడు. దీనికి ‘హనుమాన్’గా (Hanooman)
నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
‘స్పీచ్-టు-టెక్ట్స్’ సేవలు కూడా హనుమాన్
అందిస్తుందని ఐఐటీ బాంబే కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి గణేశ్ రామకృష్ణన్
తెలిపారు. భారత యూజర్ల అవసరాలకు అనుగుణంగా సర్వం, కృత్రిమ్ సంస్థలు సైతం ఏఐ మోడళ్ళను అభివృద్ధి
చేస్తున్నాయి.