ప్రముఖ
రేడియో వ్యాఖ్యాత అమీన్ సయానీ(90) తుదిశ్వాస విడిచారు. ప్రాచుర్యం పొందిన ‘బినాకా
గీత్ మాలా’ కార్యక్రమం వాయిస్ ఈయనదే. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో
ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి ఏడుగంటల సమయంలో ప్రాణాలు వదిలారని
కుటుంబ సభ్యులు వెల్లడించారు.
‘‘నమస్కార్
భాయి యోం బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్’’ అంటూ తనను తాను
పరిచయం చేసుకునే వారు. ఈ డైలాగ్ ప్రజలకు బాగా కనెక్ట్ అయింది.
సిలోన్
రేడియో స్టేషన్లో 30 నిమిషాల నిడివిలో ఈ కార్యక్రమం ప్రసారమయ్యేది. 1950లో ఈ
ప్రొగ్రోమ్ బాగా హిట్ అయింది. దీని పేరు పలుమార్లు మారినప్పటికీ ప్రత్యేకతను
మాత్రం కోల్పోకుండా శ్రోతలను ఆకట్టుకుంది.
బినాకా గీత్ మాలా, హిట్ పరేడ్, సిబాకా గీత్ మాలా
పేరిట ఈ కార్యక్రమం, 1952 నుంచి 1994 వరకు రేడియోలో ప్రసారమైంది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు సంపాదించారు. ముంబైలో 1932, డిసెంబర్ 21న
సాహితివేత్తల కుటుంబంలో సయానీ జన్మించారు.
సయానీ
మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్థించారు. 50వేలకు పైగా రేడియో షోలు చేసి రికార్డు
సృష్టించిన వ్యక్తి కన్నుమూయడం బాధాకరమని సోషల్ మీడియా వేదికగా సానుభూతి
తెలుపుతున్నారు.