ఎస్జీటీ
పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తూ ఆంధ్రప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పై
హైకోర్టు స్టే విధించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించడం
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారించిన హైకోర్టు, అడ్వకేట్ జనరల్ కు పలు ప్రశ్నలు
వేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా నోటిఫికేషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించింది.
విద్యార్థులపై ప్రయోగాలు చేయడం సరికాదని హితవు పలికింది.
డీఎస్సీ నోటిఫికేషన్ పై
స్టే విధించేందుకు న్యాయస్థానం సిద్ధపడగా, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవద్దని అడ్వకేట్
జనరల్ శ్రీరామ్ కోరారు.
ప్రభుత్వంతో
మాట్లాడి, కోర్టుకు వివరాలు అందజేసేందుకు విచారణను బుధవారానికి(నేటికి) వాయిదా
వేయాలని కోరారు. దీంతో నేడు విచారించిన ధర్మానం, ఎస్టీజీ పోస్టుల భర్తీకి బీఈడీ
అభ్యర్థులను అనుమతిపై స్టే విధించింది.