భారత్ – ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా రేపు రాంచీ వేదికగా నాల్గో మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ,
జట్టును ప్రకటించింది. బుమ్రాకు విరామం
ప్రకటించిన బోర్డ్, కేఎల్ రాహుల్ కూడా రాంచీ టెస్టులో ఆడటం లేదని పేర్కొంది. ధర్మశాల వేదికగా జరిగే ఆఖరి మ్యాచ్ లో ఆడే విషయంలో రాహుల్ ఫిట్ నెస్
లోబడి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. రాజ్కోట్ టెస్టుకు దూరంగా ఉన్న పేసర్ ముకేశ్ కుమార్ ను
రాంచీ టెస్టులో
ఆడనున్నాడు.
రాంచీ టెస్టులో ఆడే భారత జట్టు ..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవ్దుత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్.
రాంచీ మైదానంలో గతంలో కేవలం రెండు మ్యాచ్లు
మాత్రమే జరిగాయి. ఒక
మ్యాచ్ లో భారత్ గెలవగా, మరో మ్యాచ్ డ్రా అయింది. 2017లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రా గా ముగిసింది. 2019లో దక్షిణాఫ్రికాపై భారత్ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది.