న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు
సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్(95) తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా వృద్ధప్య
సమస్యలతో బాధపడుతున్న నారీమన్ దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన
మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
న్యాయరంగంలో నారీమన్ అందించిన సేవలకు గాను భారత
ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో
పద్మవిభూషణ్ తో గౌరవించింది. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగాను
సేవలందించారు.
బాంబే హైకోర్టు లాయర్ గా న్యాయవాద వృత్తిని
ప్రారంభించిన నారీమన్, తర్వాతి కాలంలో
దిల్లీకి మారారు. 1972లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్నికైన నారీమన్ అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ
నిర్ణయాన్ని వ్యతరేకిస్తూ 1975లో పదవికి రాజీనామా
చేశారు.
భోపాల్ గ్యాస్ కంపెనీ ప్రమాద కేసులో యూనియన్
కార్బైడ్ కంపెనీ తరఫున వాదించిన నారీమన్, ఆ తర్వాత అది పొరుపాటు అని ఒప్పుకున్నారు.
గోలఖ్ నాథ్, ఎస్పీ గుప్తా, టీఎంఏ ఫౌండేషన్ కేసుల్లో
నారీమన్ వాకాల్తా పుచ్చుకున్నారు. 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు
వినిపించి ఆమెకు బెయిల్ దక్కేలా చేశారు.
నారీమన్
మృతిపై కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సంతాపం
తెలిపారు. నారీమన్ మృతితో ఒక యుగం ముగిసిందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్ప
వ్యక్తి నారీమన్ అని కొనియాడారు.