దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ప్రారంభంలో స్వల్ప నష్టాలను చవిచూసినా తరవాత స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. కీలకరంగాలకు పెట్టుబడిదారుల నుంచి మద్దతు లభించింది. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.
ఇవాళ సెన్సెక్స్ 349 పాయింట్లు పెరిగి, 73057 వద్ద ముగిసింది. సెన్సెక్స్ (sensex) ఇంట్రాడేలో 73వేల మార్కు దాడటం ఇదే మొదటిసారి. నిప్టీ 74 (nifty) పాయింట్లు పెరిగి 22196 వద్ద ముగిసింది. రూపాయి స్వల్పంగా బలపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 82.96గా నమోదైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.