మరాఠా
రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠాలకు విద్యా,
ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం,
బిల్లు ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదం తెలిపింది.
మండలి
ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ సంతకం చేస్తే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఈ చట్టం
అమలులోకి వస్తే పదేళ్ళ వరకు సమీక్షించకూడదనే షరతును కూడా బిల్లులో పొందుపరిచారు.
మరాఠాల
అభివృద్ధి కోసం విద్య, ఉద్యోగాల్లో 10
శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఏక్నాథ్ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు
అనుగుణంగా కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి
బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించారు.
మరాఠా
రిజర్వేషన్ బిల్లు, ఇప్పటికి మూడు సార్లు అసెంబ్లీ ముందుకు రాగా తొలిసారి ఆమోదం
లభించింది. మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ
బిల్లును ప్రవేశపెట్టారు.