ఆర్టికల్
370 తొలగింపుతో జమ్ము-కశ్మీర్ లో అభివృద్ధి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్ము-కశ్మీర్ ప్రాంతం సమతుల్యత దిశగా
ముందుకుసాగుతోందన్నారు. ప్రజా రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయాన్ని ప్రజలందరూ
పొందేందుకు బీజేపీ పాలన దొహదపడిందన్నారు.
జమ్మూ
పర్యటనలో పాల్గొన్న ప్రధాని మోదీ, పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. మౌలానా
ఆజాద్ స్టేడియంలో నిర్వహించిన సభలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు.
బహిరంగ సభ వేదికగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, బాలీవుడ్ నటి యామీ
గౌతమ్ నటించిన
ఆర్టికల్ 370 సినిమా ను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ సినిమా విడుదల గురించి
విన్నట్లు తెలిపిన మోదీ, మంచి విషయాలు తెలుసుకునేందుకు ప్రజలకు ఈ సినిమా
ఉకరిస్తుందన్నారు.
వారసత్వ
రాజకీయాలపై మాట్లాడిన ప్రధాని మోదీ, దశాబ్దాల తరబడి వంశపారంపర్య రాజకీయాల భారాన్ని
జమ్ము-కశ్మీర్ ప్రజలు భరించాల్సి వచ్చిందన్నారు. అభివృద్ధి చెందిన భారత్ తో పాటు అభివృద్ధి చెందిన జమ్మూకశ్మీర్ కూడా భాగం కావాలన్నారు.
గడిచిన
పదేళ్లలో ఈ ప్రాంతంలో కొత్తగా 50 డిగ్రీ కళాశాలలు ఏర్పాటయ్యాయని గుర్తు
చేశారు. గతంలో విద్యాసంస్థలకు నిప్పుపెట్టేవారని, ఇప్పుడు అలంకరిస్తున్నారన్నారు.