అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ,అమెరికా ఎన్నికల్లో జార్జియా నుంచి యువ భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి సెనేటర్‌గా బరిలో నిలుస్తున్నారు. జెన్ జెడ్‌గా వ్యవహరించే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన రామస్వామి వయసు కేవలం 24 సంవత్సరాలే కావడం గమనార్హం. ఇంత చిన్న వయసులో సెనెట్‌కు పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్‌గా అశ్విన్ రామస్వామి చరిత్రలో నిలిచారు.
నా సమాజానికి తిరిగి ఇవ్వడానికే రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జియా స్టేట్ సెనేట్‌కు పోటీ చేస్తున్నానని అశ్విన్ రామస్వామి (ashwin ramaswamy) మీడియాకు వివరించారు. అందరికీ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నట్లు ఆయన చెప్పారు.
యువత రాజకీయాల్లో తమ సత్తా చాటడంతోపాటు, తమకు స్వరం ఉందని నిరూపిస్తామన్నారు. రాజకీయాల్లో సాంప్రదాయేతర నేపథ్యాల నుంచి వచ్చిన తనలాంటి యువతకు ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. జార్జియాలోని 48వ జిల్లా నుంచి అశ్విన్ సెనేట్‌కు పోటీ చేస్తున్నారు.
అశ్విన్ రామస్వామి నెగ్గితే మొదటి జెన్ జెడ్ సెనేటర్‌గా గుర్తింపు పొందనున్నారు. కంప్యూటర్ సైన్స్, న్యాయ శాస్త్రం రెండు డిగ్రీలను అశ్విన్ కలిగి ఉన్నారు. అశ్విన్ తల్లిదండ్రులు, తమిళనాడు నుంచి 1990లో అమెరికాకు వలస వెళ్లారు.