Sandeshkhali: A place of atrocities on Hindus, in particular on women and girls
సందేశ్‌ఖాలీ పశ్చిమబెంగాల్లోని 24పరగణాల
జిల్లాలో ఓ ప్రాంతం. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఆ ప్రాంతంలో హిందూ షెడ్యూల్డు
కులాల జనాభా ఎక్కువ. బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న 14 నియోజకవర్గాల్లో సందేశ్‌ఖాలీ
కూడా ఒక నియోజకవర్గం. దురదృష్టం ఏంటంటే ఆ అన్ని నియోజకవర్గాల్లోనూ తృణమూల్
కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. టీఎంసీ కుట్రల్లో ఆ ప్రాంతం కూడా ఒక భాగం
అయిపోయింది. అందుకే టీఎంసీ గూండాలు ఆ ప్రాంతంలో హిందూ ఎస్సీ మహిళలు, మైనర్ బాలికలను బెదిరించి తమ పార్టీ కార్యాలయానికి లాక్కువెళ్ళి, అక్కడ వారిపై నెలల తరబడి సామూహిక అత్యాచారాలు చేస్తున్నారు.
దేశ సరిహద్దుల్లో ఉన్న ఆ 14 నియోజకవర్గాల్లోనూ
బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలా అక్కడి జనసంఖ్యను
మార్చేసి, వాటిని ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా మార్చేసే కుట్రకు టీఎంసీ
నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నిజానికి సందేశ్‌ఖాలీ,
దాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాద కార్యకలాపాలతో
పాటు, మిగతా అన్నిరకాల నేరాలకూ అడ్డాలుగా మారిపోయాయి.
కొంతకాలం క్రితం వరకూ అక్కడ హిందువుల కంటె ముస్లింల
జనాభా తక్కువగానే ఉండేది. కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్ల కారణంగా అసాంఘిక
శక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ ప్రాంతపు జనాభాలో చాలా మార్పులు
వచ్చేసాయి. అక్కడి జనాభాలో ఇప్పుడు అత్యధికంగా ఉన్నది రోహింగ్యా ముస్లిములంటే
పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత ఎన్నికల సమయంలో
అక్కడ జరిగిన నేరఘటనల్లో అత్యధికం అక్రమంగా చొరబడిన ముస్లిములు చేసిన నేరాలే. ఆ
నేరాల్లో ప్రధానమైనవి ఆవుల దొంగతనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, అక్రమ
ఆయుధాల వినియోగమే. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు అన్నింటిలోనూ ముస్లిములే
నేరస్తులుగా ఉన్నారు.
సందేశ్‌ఖాలీలో ఇప్పుడు వెలుగుచూస్తున్న ఘటనలు
నిజానికి ఇప్పుడే కొత్తగా జరిగినవి కావు. ఆ ప్రాంతంలో చాలాకాలంగా అలాంటి సంఘటనలు
జరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు 2000 సంవత్సరంలో దక్షిణ 24 పరగణాల జిల్లాలో బసంతి
నియోజకవర్గంలో ఒక హిందూ ఎస్సీ మహిళపై, అక్రమంగా చొరబడిన ముస్లిములు
సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సంఘటనకు
వ్యతిరేకంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దాని
ఫలితంగా, ముస్లిం రేపిస్టులు నలుగురు ఆరెస్సెస్ కార్యకర్తలను హత్య చేసారు.
ఆ ప్రాంతాల్లో హిందూ మహిళలపై సామూహిక అత్యాచారం
చేసిన ఘటనలు పదుల్లో కాదు, వందల్లో ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా ఆరెస్సెస్
కార్యకర్తలు ఎప్పుడు ఎలుగెత్తి నిరసనలు తెలిపినా, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా
వారినే లక్ష్యంగా చేసుకుని ముస్లిం ముష్కరులు దాడులు చేశారు. ఎంతోమంది సంఘ
కార్యకర్తలను చంపేసారు, వారి ఇళ్ళను తగలబెట్టేసారు.
బంగ్లాదేశ్ సరిహద్దులోని భారతదేశ ప్రాంతంలో అక్రమ
చొరబాటుదారులు ఎంత బీభత్సం సృష్టించారంటే, ఎన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు
పాల్పడ్డారంటే 2007లో వారి అల్లర్లను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం బోర్డర్
సెక్యూరిటీ ఫోర్స్ సాయం తీసుకోవలసి వచ్చింది. ఆ ప్రాంతంలో హిందువుల మీద పాల్పడిన
అఘాయిత్యాల జాబితా చాలా పెద్దది. 2017లో ఒక సోషల్ మీడియా పోస్ట్‌కు వ్యతిరేకంగా
హిందువులను లక్ష్యం చేసుకుని దాడులు చేసారు.
ఈ అక్రమ చొరబాటుదారులైన ముస్లింలు ఆ ప్రాంతంలోని
హిందూ షెడ్యూల్డు కులాలకు చెందిన మహిళలను, మైనర్ బాలికలను బలవంతంగా ఎత్తుకునిపోయి
సామూహిక అత్యాచారాలు చేస్తున్నారు.
ఆ ప్రాంతంలోని దొంగలు డ్రగ్స్ వ్యాపారం
చేస్తున్నారు. దొంగతనంగా ఆయుధాల రవాణా చేస్తున్నారు. ఆవులను చంపేసి వాటి మాంసంతో
వ్యాపారం చేస్తున్నారు. వారందరూ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన ముస్లిములే.
షేక్ షహన్షా వంటి ముస్లిము నాయకులదే అక్కడ పెత్తనమంతా.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతున్న
ముస్లిములు, రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వడం, వారిని భారతీయులుగా మార్చి వారితో దుర్మార్గాలు
చేయించడం ద్వారా షేక్ షహన్షా వంటివారు అక్రమంగా కోట్లకు పడగెత్తుతున్నారు. వారు
మొదట్లో సీపీఐ(ఎం)లో ఉండేవారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లోకి మారిపోయారు.
వారిప్పుడు టీఎంసీలో గొప్ప నాయకులు.
షేక్ షహన్షా అక్రమ ఆర్జనల గురించి పరిశోధించడానికి
వెళ్ళిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం మీద అతని మనుషులే దాడి చేసారు,
చంపేయడానికి ప్రయత్నించారు. ఆ దాడిలో ఈడీకి చెందిన పలువురు అధికారులు తీవ్రమైన
గాయాలపాలయ్యారు.
షేక్ షహన్షా, అతని అనుచరులు దళిత మహిళలను, మైనర్
బాలికలను ఎత్తుకుపోయి తమ పార్టీ కార్యాలయానికి తీసుకుపోతుండేవారు. అక్కడ వారిని
నెలల తరబడి నిర్బంధించి వారిపై సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాలు అందజేస్తామని,
పార్టీలో పదవులు ఇప్పిస్తామని ఆశచూపి అనేకమంది మహిళలను చూరగొనేవారు. ఒక్కసారి
పార్టీ కార్యాలయానికి వచ్చాక ఇంక ఆ మహిళల కథ అంతేసంగతులు.
ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో కూడా మధ్యయుగాల నాటి
సుల్తానుల్లా వ్యవహరించిన ఆ నేరస్తులకు ప్రభుత్వ అధికారులు, గద్దెమీదున్న
సొంతపార్టీ తృణమూల్ కాంగ్రెస్ అగ్రనేతల పూర్తి అండదండలు ఉన్నాయి. బషీర్హాట్ ప్రాంత
ప్రస్తుత ఎస్పీ హుసేన్ మెహందీ రెహమాన్ వంటి అధికారులు ఎంతోమంది వారి కొమ్ముకాస్తున్నారు.
అందుకే షహన్షా అతని రౌడీముఠా అకృత్యాలకు అడ్డే
లేకుండా పోయింది. వారికి వ్యతిరేకంగా నోరెత్తితే చాలు, అలాంటివారిని తీవ్రంగా
హింసిస్తారు. వారికి ఆసుపత్రుల్లో వైద్యమైనా అందదు. వాళ్ళమీద పోలీస్ స్టేషన్లలో
ఎఫ్ఐఆర్లు నమోదుచేయడం లేదు.
షహన్షా గ్యాంగ్ లాంటి అక్రమ ముఠాల చేతిలో
సామూహిక అత్యాచారాలకు బలైపోతున్న బాధితుల మీద, వారికి బాసటగా నిలిచి ఎలుగెత్తి
ఆక్రోశించేవారి మీద దొంగకేసులు పెడుతున్నారు, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు.
పైగా, ఈ బీభత్స ఘటనలు అసలు జరగనేలేదంటూ, ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ చేస్తున్న ప్రచారం
మాత్రమేనంటూ అబద్ధాలు వ్యాపింపజేస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్
పార్టీ సూచనల మేరకు పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని మూసివేసారు. ఎవరినీ బైటకు
పోనీయడం లేదు, లోపలికి రానీయడం లేదు.
జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, బీజేపీ
మహిళా విభాగం ప్రతినిధులు అక్కడకు వెళ్ళాలని ప్రయత్నించారు, కానీ వారెవరినీ
వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. అందుకే వారు ఆ ప్రాంతంలో రాష్ట్రపతిపాలన విధించాలని
డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులోను, కోల్‌కతా హైకోర్టులోనూ ప్రజాప్రయోజన
వ్యాజ్యాలు దాఖలయ్యాయి, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని న్యాయస్థానాలను కోరారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాలు,
దక్షిణ 24 పరగణాలు, ఉత్తర దినాజ్‌పూర్, ముర్షీదాబాద్, మాల్దా, నదియా, హుగ్లీ వంటి
సరిహద్దు జిల్లాలు, ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఇలాంటి ఘటనలు లెక్కకు మిక్కిలిగా బైటపడుతున్నాయి.
హిందువుల నరమేధం, వారిపై మతపరమైన దాడులు, సామాజిక
వివక్ష, శారీరక హింస, గృహదహనాలు, హిందూ మహిళలు, మైనర్ బాలికలపై గ్యాంగ్‌రేప్‌లు,
చాలా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. ఆ విధంగా భారత్-బంగ్లాదేశ్
సరిహద్దు ప్రాంతాల్లో హిందువుల ఉనికే లేకుండా తుడిచిపెట్టే ప్రయత్నాలు
జరుగుతున్నాయి.
గతంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాలు, ఇప్పుడు మమతా
బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం… ఇలా అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ,
వారు ముస్లిం ఓటుబ్యాంకు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. దానికోసం హిందువుల
బతుకులను పట్టించుకోలేదు. వారి మానవహక్కుల గురించి కనీసం ఆలోచించలేదు.