తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రైతులు చేపట్టిన ఢిల్లీ చలో (delhi chalo) యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. సోమవారం తెల్లవారుజాము వరకూ రైతు సంఘాల నేతలు, మంత్రుల బృందంతో చర్చలు జరిపారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన చర్చలు సోమవారం తెల్లవారుజాము వరకు సాగాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు సంఘాల నేతలతో చండీగఢ్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు.
కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజన్సీలు కొనుగోలు చేస్తాయని మంత్రులు ప్రతిపాదించారు. కందులు, మినుములు, మొక్కజొన్న పండించే రైతుల వద్ద నుంచి ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీలాంటి సహకార సంఘాలు ఒప్పందం చేసుకుని కనీస మద్దతు ధర ఇస్తాయని మంత్రులు రైతు సంఘాలకు తెలిపారు. రైతుల (farmers protests) వద్ద నుంచి కొనుగోలు చేసే పరిమాణం విషయంలో, పరిమితులు ఉండవని తెలిపారు.దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని మంత్రులు, రైతు సంఘాల నేతలకు వివరించారు.
మంత్రుల ప్రతిపాదనలను రైతు సంఘాల నేతలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే పంజాబ్ హర్యానా సరిహద్దులో నిలిచిపోయిన చలో ఢిల్లీ కార్యక్రమం ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని ప్రకటించారు. అన్ని రైతు సంఘాలు, రైతులతో చర్చించి తమ అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేస్తామని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకులు చెప్పారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు