భారత
మహిళా బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ టీమ్
ఛాంపియన్స్ ట్రోఫీలో బంగారుపతకం
సాధించింది.
నేడు
జరిగిన తుది పోటీలో థాయలాండ్ ను భారత జట్టు 3-2తో ఓడించింది. లీగ్ దశలో చైనాను
ఓడించిన భారత క్రీడాకారులు, ఫైనల్ లో హాంకాంగ్ పై విజయ సాధించి గోల్డ్ మెడల్
సాధించారు.
పైనల్
కు చేరుకునే ప్రస్థానంలో భాగంగా జపాన్, హాంకాంగ్ ను కూడా ఓడించి ఆసియా
బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేశారు. రెండేళ్ళ కిందట థామస్ కప్
ను కైవసం చేసుకున్న బారత్ కు ఆ తర్వాత ఇదే చెప్పుకోదగిన విజయం.
పీవీ
సీంధు, గాయత్రి, ట్రెసా జూలీలు సింగిల్స్ లో విజయం సాధించారు. సుపనింద కటెథంగ్ ను
సిందు 21-12, 21-12 తో ఓడించి భారత్ ను
1-0 ఆధిక్యంలో నిలిపింది. గాయత్రి, ట్రెసాలు అద్భుతంగా ఆడటంతో భారత్ 2-0 తో థాయ్‌లాండ్
పై ఆధిక్యం సాధించింది. డిసైడర్ పోరులో అన్మోల్, పోర్న్ పిచాను 21-14, 21-19తొ ఓడించింది.
దీంతో టోర్నీ చరిత్రలో భారత్ కు తొలిసారి స్వర్ణపతకం దక్కింది.