జర్మనీలోని
మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేదికగా భారత్-చైనా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. సరిహద్దు ఉద్రిక్తతల వేళ ఈ భేటీ కీలక పరిణామంగా మారింది.
సదస్సు
విరామ సమయంలో భారత్ చైనా విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ సమావేశమై పలు అంశాలపై
చర్చించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఇరువురు నేతలు కలుసుకోవడంతో ఈ భేటీకి
ప్రాధాన్యం సంతరించుకొంది.
సదస్సు
అనంతరం,
జై
శంకర్ ను అంతర్జాతీయ మీడియా పలు ప్రశ్నలు అడగగా ఆయన ధీటుగా బదులిచ్చారు. భారత్ ఇంకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న
విషయాన్ని ప్రశ్నించగా, దీనిని సమస్యగా చిత్రీకరించడం తగదని మీడియాకు హితవు పలికారు.
మంచి భాగస్వాములు ఇచ్చే ఆప్షన్లను తెలివైన భాగస్వాములు ఎంచుకుంటారని చురకులు
అంటించారు.
అక్టోబర్ 7న
ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని ఉగ్రవాదుల దుశ్చర్యగా అభివర్ణించిన జైశంకర్, ప్రతిచర్య
విషయంలో టెల్అవీవ్ కూడా అంతర్జాతీయ చట్టాలను దృష్టిలో పెట్టుకోవాలని హితవు
పలికారు.