వ్యక్తిగత
అత్యవసర పరిస్థితి కారణంగా రాజ్కోట్ టెస్టు మూడో రోజు ఆటకు దూరమైన అశ్విన్, నేడు
జట్టుతో కలుస్తున్నాడు. ఈ విషయాన్ని
బీసీసీఐ వెల్లడించింది. కుటుంబ అత్యవసర పరిస్థితి కారణంగా విరామం తీసుకున్న
అశ్విన్ ఆదివారం జరిగే ఆటలో ఆడతాడని స్పష్టం చేసింది.
రెండో
రోజు ఆటలో అశ్విన్, వికెట్ తీసి టెస్టు క్రికెట్ లో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు.
ఈ ఫీట్ సాధించిన కొద్దీ సేపటికే, కుటుంబ సభ్యుల హెల్త్ ఎమర్జన్సీ కారణంగా ఆట
ముగిసిన తర్వాత, చెన్నై వెళ్ళాడు. నేడు
మళ్లీ జట్టుతో కలవనున్నాడు.
నాలుగో
రోజు లంచ్ విరామసమయానికి భారత్, 440 పరుగుల ఆధిక్యం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్
కి 118 పరుగులు జోడించింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 314
పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్(149), సర్ఫరాజ్
ఖాన్(22) క్రీజులో ఉన్నారు.
శుభమన్ గిల్ (91) రనౌట్ అయ్యాడు. కుల్ దీప్ పరుగు కోసం పిలిచి వెనక్కి
మళ్ళడంతో బెన్ స్టోక్స్ , గిల్ ను ఔట్ చేశాడు. దీంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన
యశస్వీ, మళ్ళీ క్రీజులోకి వచ్చాడు. 71.4 బంతికి
కుల్ దీప్ (27) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్, క్రీజులోకి
వచ్చాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్
నాలుగు వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది.