పంటలకు
మద్ధతు ధర ప్రకటించడంతో పాటు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన
ఆరో రోజు కొనసాగుతోంది.
సమస్యల
పరిష్కారం కోరుతూ ఛలో దిల్లీకి రైతు సంఘాలు పిలుపునివ్వగా పోలీసులు దిల్లీ
సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. దీంతో ఆరు
రోజులుగా రైతులు శంభూ సరిహద్దు వద్దే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల డిమాండ్ల
పరిశీలనకు కొంత సమయం కావాలని ప్రభుత్వం కోరినట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్
కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ సింగ్ చెప్పారు. డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర వ్యవసాయశాఖమంత్రితో
మాట్లాడేందుకు అధికారులు సమయం కోరారని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన చర్చల్లో
ఎలాంటి పురోగతి లేదన్నారు.
రైతుల
ఆందోళన నేడు, ఆరో రోజుకు చేరుకోగా, ఇప్పటి
వరకు నాలుగు విడతలుగా రైతులు, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి.
‘ఛలో
దిల్లీ’ ఆందోళనకు సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర),
కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చాయి. కేంద్రప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం
చూపాలని కోరుతున్నారు. దిల్లీలో ప్రవేశించేందుకు
ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అప్పటి నుంచి పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాలైన శంభూ, కనౌరీలోనే
రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య నేడు జరిగే చర్చలు
కొలిక్కి వస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే మరికొంతకాలం ఈ
ప్రతిష్ఠంభన కొనసాగుతుంది.