పశ్చిమబెంగాల్ అటవీ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. పశ్చిమబెంగాల్ శిలిగురి సఫారీ పార్క్‌లో అక్బర్, సీత అనే రెండు మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. అటవీశాఖ అధికారుల నిర్ణయంపై వీహెచ్‌పీ కోర్టును ఆశ్రయించింది. జూ పార్కు డైరెక్టరును ప్రతివాదులుగా చేర్చారు.
కోల్‌కతా హైకోర్టులో వీహెచ్‌పీ నాయకులు కేసు వేయగా, అది 20వ తేదీ విచారణకు రానుంది. త్రిపురలోని సిపాహాజలా జూ పార్కు నుంచి అధికారులు మగ, ఆడ సింహాలను తీసుకువచ్చారు. కావాలనే అధికారులు అలాంటి పేర్లు పెట్టారని వీహెచ్‌పీ ఆరోపిస్తోంది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలంటూ వారు కోర్టును ఆశ్రయించారు. అయితే వాటికి ఇంకా పేర్లు ఖరారు చేయలేదని అధికారులు చెబుతున్నారు.