దేశంలో
అత్యంత ఎక్కువ ప్రజామోదం, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో ఉత్తర ప్రదేశ్
సీఎం యోగీ, రెండోస్థానంలో నిలిచారు. యోగీ నాయకత్వ ప్రతిభకు 51.3 శాతం మంది మద్దతు
తెలిపారు. ఓ సర్వే సంస్థ నిర్వహించిన శాంపిల్స్ ఆధారంగా జాబితాను రూపొందించారు.
ఒడిశా
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, ఆయన పాలనపై 52.7 శాతం
మంది సంతృప్తి వ్యక్తంచేశారు. యోగీ, నవీన్ పట్నాయక్ మధ్య కేవలం ఒక్క శాతం మాత్రమే
తేడా ఉంది.
అస్సాం
సీఎం హేమంత్ మూడో స్థానంలో ఉండగా ఆయన
పాలనపై 48.6 శాతం మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర
పటేల్, 42.6 శాతం నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఐదో నిలిచిన త్రిపుర
సీఎం మాణిక్ సాహా కు కూడా రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. ఆయన పాలనను 41.4 శాతం
మంది అంగీకరిస్తున్నారు. అంకితభావం, నిరాడంబర వ్యక్తిత్వం, నిజాయితీ, ఆయన నేతృత్వంలో
జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా మాణిక్ సాహా ప్రజాదరణ పెరిగింది. ప్రజానేత అంటూ
మాణిక్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురుపిస్తున్నారు.
క్షేత్రస్థాయి రాజకీయాలపై పట్టు, ఎలాంటి
సమస్యనైనా సులువుగా పరిష్కరించగల నేర్పరి అని కొనియాడుతున్నారు. త్రిపుర అభివృద్ధికి
బాటలు వేశారని వివరిస్తున్నారు.
దంతవైద్యుడి
నుంచి రాజకీయ నేతగా మారిన మాణిక్ సాహా , 2023 లో రెండోసారి త్రిపుర సీఎంగా
ప్రమాణంచేశారు. 2016లో కాంగ్రెస్ ను వీడి భారతీయ జనతాపార్టీలో చేరారు. 2020లో
బీజేపీ త్రిపుర చీఫ్ గా, 2022లో రాజ్యసభ కు ఎన్నికయ్యారు.