మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్మాదులు చెలరేగిపోయారు. మానవత్వానికి మచ్చతెచ్చేలా ప్రవర్తించారు. గర్భిణిపై సామూహిక అత్యాచారం (crime news) చేసి, ఆపై ఆమెకు నిప్పుపెట్టారు. ఈ ఘటన ఎంపీలోని మురేనా జిల్లాలో చోటుచేసుకుంది. 80 శాతం కాలిన గాయాలతో మహిళ కొనఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. పోలీసుల కథనం ప్రకారం.
అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న మహిళ భర్తను రాజీ పేరుతో పిలిచారు.భర్తతో పాటు బాధిత మహిళ కూడా వెళ్లింది. ఆమెపై భర్తతోపాటు, మరో ఇద్దరు కూడా అత్యాచారానికి దిగారు. అనంతరం ముగ్గురూ కలసి బాధితురాలిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. బాధితురాలిని గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి భర్త అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చాడు. బాధితురాలి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి నమోదు చేశారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.