సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ అవార్డు, ఈ ఏడాది ఇద్దరిని వరించింది. ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యులుకు ప్రకటించారు. 58వ జ్ఞానపీఠ్ అవార్డుకు వీరిరువు ఎంపికయినట్లు కమిటీ తెలిపింది. జ్ఞానపీఠ్ అవార్డుల కమిటీ శనివారం ఈ నిర్ణయం ప్రకటించింది. సంస్కృతం, ఉర్దూ భాషల్లో ప్రముఖ రచనలు చేసిన గుల్జార్, జగద్గురుకు జ్ఞానపీఠ్ ప్రకటించడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
1944లో ఏర్పాటైన జ్ఞానపీఠ్ అవార్డును సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్నారు. సంస్కృతంలో రచనలు చేసిన వారికి ఈ అవార్డు దక్కడం ఇది రెండోసారి కాగా, ఉర్దూలో ఐదోసారి. అవార్డుతోపాటు రూ.21 లక్షల నగదు బహుమతి, వాగ్దేవి విగ్రహం, ప్రశంసాపత్రం అందిస్తారు.2023 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రకటించారు.