సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అంతా సిద్దం చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘ ప్రకటించింది. ఒడిషాలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు యంత్రాంగాన్ని సిద్దం చేసినట్లు తెలిపారు. ఒడిషాల్లో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శంగా పనిచేయాలని ఆదేశించారు. అన్ని పార్టీలను అందుబాటులో ఉండాలని అధికారులను కోరారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం, మందు, హింసకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌కు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలకు మూడంచెల భద్రత కల్పించనున్నారు.