ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ – ఎఫ్14 ప్రయోగం విజయవంతమైంది. శనివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన ప్రయోగం 6 గంటల 46 నిమిషాలకు ముగిసింది. జీఎస్ఎల్వీ – ఎఫ్14 వాహకనౌకతో ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. కక్ష్యలోని ప్రవేశించేందుకు వాహకనౌక మరో రెండు రోజులు ప్రయాణం చేయాల్సి ఉంది.
వాతావరణం, భూమి, సముద్ర ఉపరితలాలపై ప్రయోగాలు చేసేందుకు ఈ ఉపగ్రహం పనిచేయనుంది. ఇప్పటికే ప్రయోగించిన రెండు వాతావరణ ఉపగ్రహాలతో ఇది సమన్వయం చేసుకోనుంది. 2275 కిలోల బరువైన ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ వాహకనౌక విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఇక నుంచి వాతావరణ పరిశీలన మరింత మెరుగ్గా జరగనుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.