ఇంగ్లండ్,
భారత్ మధ్య రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ మెరుగ్గా ఆడుతోంది. తొలి
ఇన్నింగ్స్ లో 126 పరుగుల ఆధిక్యం సాధించిన రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్ లోనూ
సత్తా చాటుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 51 ఓవర్లు ఆడి రెండు వికెట్లు
నష్టపోయి 196 పరుగులు చేసింది.
ఓపెనర్
యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశారు. 131 బంతుల్లో 104 పరుగులు చేసి రిటైర్ హార్ట్ అయ్యాడు.
వెన్నునొప్పి కారణంగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో ఐదు
సిక్సులు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన రజత్ పటిదార్
డకౌట్ గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(19) ఐట్ కావడంతో క్రీజులోకి వచ్చిన శుభమన్
గిల్(65*), నైట్
వాచ్ మెన్ గా వచ్చిన కుల్దీప్(3*)
మూడో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో ఉన్నారు.
ప్రస్తుతం భారత్ 322 పరుగుల లీడ్ లో ఉంది. నాలుగో
రోజు ఆటలో మరో 150 పరుగులు చేయగల్గితే భారత్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంగ్లండ్
బౌలర్లలో జోరూట్, హార్ట్ లీ చెరో వికెట్
తీశారు.