తమిళనాడులో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విరుద్‌నగర్ జిల్లాలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో (sivakasi blasts) తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వెంబకొట్టాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. కెమికల్ మిక్సింగ్ రూములో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పేలుడు ధాటికి కర్మాగారంతోపాటు, సమీపంలోని నాలుగు భవనాలు ధ్వంసం అయ్యాయి. ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది గాయపడ్డారు. వారిని శివకాశిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు ఘటన శనివారం ఉదయం జరిగింది.