రాజ్కోట్
వేదికగా జరుగుతున్న మూడో టెస్టు నుంచి స్పిన్నర్ అశ్విన్ అర్ధాంతరంగా
తప్పుకోవాల్సి వచ్చింది. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన అశ్విన్, రెండో రోజు ఆట
ముగిశాక మెడికల్ ఎమర్జన్సీ కారణంగా చెన్నై వెళ్ళాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వైఎస్
ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
తల్లి
అనారోగ్యం కారణంగానే మ్యాచ్ మధ్యలోనే వెళ్ళినట్లు వెల్లడించారు. ఆమె త్వరగా కొలుకోవాలని
శుక్లా ఆకాంక్షించారు. అశ్విన్ కు అవసరమైన
సాయం అందించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉందన్నారు.
అశ్విన్
లేకపోవడంతో భారత్ జట్టు కేవలం నలుగురు బౌలర్లతోనే ఆడుతోంది. కేవలం సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ కు మాత్రమే
అవకాశం కల్పించారు. అతడు బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు వీలు లేదు. కేవలం కాంకషన్
సబ్ స్టిట్యూట్ ఆటగాళ్ళును మాత్రమే బౌలింగ్, బ్యాటింగ్ కు అనుమతిస్తారు. ప్రస్తుతం
భారత్ పదిమంది ఆటగాళ్ళతోనే బ్యాటింగ్ కు దిగింది.
మూడో
రోజు లంచ్ సమయానికి 290 పరుగులు చేసి ఐదు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్, లంచ్
విరామం తర్వాత 29 పరుగులు మాత్రమే చేయగల్గింది. 319 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి
ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేయడంతో 126 పరుగుల ఆధిక్యం లబించింది.
డకెట్
153 పరుగులు చేయగా, ఒలీ పోప్ (39), బెన్ స్టోక్స్(41) మాత్రమే రాణించారు.
భారత బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా,
కుల్దీప్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. బుమ్రా, అశ్విన్ కు ఒక్కో
వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
రెండో
ఇన్నింగ్స్ లో భారత్, రూట్ వేసిన 11.3 బంతికి తొలి వికెట్ నష్టపోయింది. రోహిత్
శర్మ(19) బౌల్డ్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లకు భారత్ ఒక వికెట్ నష్టానికి 34 పరుగులు
చేసింది. టీ బ్రేక్ సమయానికి భారత్ 170 పరుగుల ఆధిక్యం సాధించింది. మూడో సెషన్ లో గిల్,
జైస్వాల్ నిలకడగా ఆడారు. జైస్వాల్ 95 బంతుల్లో 80 పరుగులు, గిల్ 26 పరుగులతో క్రీజులో
ఉన్నారు.