సార్వత్రిక
ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ కాంగ్రెస్ను కీలక నేతలు వీడుతున్నారు. మధ్యప్రదేశ్
కాంగ్రెస్ అగ్రనేత, మాజీ సీఎం కమలనాథ్, ఆయన కుమారుడు ఎంపీ నకుల్ నాథ్ త్వరలో
బీజేపీలో చేరతారని ప్రచారం జరుతోంది.
నకుల్
నాథ్ తన సోషల్ మీడియా ఖాతా బయోల్లో ఉన్న కాంగ్రెస్ అనే పదాన్ని తొలగించడంతో ఈ
ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.
నేడు దిల్లీ పర్యటనలో ఉన్న కమల్ నాథ్ , బీజేపీ
అగ్రనేతలతో సమావేశం అవుతారని కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి.
మధ్యప్రదేశ్
సీనియర్ కాంగ్రెస్ నేతలు పలువురు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో కమల్
నాథ్, ఆయన కుమారుడు నకుల్ కూడా కాషాయ కండువా మెడలో వేసుకోవడం ఖాయమని చర్చ
జరుగుతోంది.
అయోధ్య
రామాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళకూడదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీలోని
పలువురు నేతలు వ్యతిరేకించారని బీజేపీ మధ్యప్రదేశ్ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు.
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు, తమ పార్టీలో చేరతామంటే
స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కమల్ నాథ్, నకుల్ నాథ్ చేరిక విషయాన్ని
ప్రస్తావిస్తూ అయోధ్య విషయంలో కాంగ్రెస్ నిర్ణయంతో కలత చెందిన వారంతా ఆ పార్టీని
వీడటానికి సిద్ధపడ్డారన్నారు.
గత
పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో 28 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా,
ఛింద్వారా నుంచి కాంగ్రెస్ తరఫున నకుల్ నాథ్ విజయం సాదించారు. వచ్చే ఎన్నికల్లో
కూడా తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని నకుల్ ఇటీవల ప్రకటించారు. కానీ కాంగ్రెస్
అధిష్టానం మాత్రం ఏ విషయం తేల్చలేదు.
ఛింద్వారా నియోజకవర్గం కమల్ నాథ్ కుటుంబానికి
కంచుకోట లాంటిది. 9 సార్లు కమల్ నాథ్ కుటుంబ సార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం
సాధించారు.