ఇంగ్లండ్,
భారత్ మధ్య రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు, మూడో రోజు ఆటలో తొలి సెషన్
ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి 26 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ మూడు వికెట్లు నష్టపోయి,
83 పరుగులు చేసింది. కులదీప్ రెండు వికెట్లు తీయగా బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు.
క్రీజులో బెన్ స్టోక్స్(39), బెన్ ఫోక్స్ (9) ఉన్నారు. ఇంగ్లండ్, భారత్ కంటే ఇంకా
155 పరుగుల వెనుకంజలో ఉంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్, రెండు
వికెట్ల నష్టపోయి 207 పరుగులు చేసింది. క్రీజులోకి డకెట్(133), రూట్(9) వచ్చారు.
బుమ్రా వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో జోరూట్(18) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో
బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. అయితే కుల్ దీప్ వేసిన 40.4 బంతికి బెయిర్ స్టో
పరుగులు చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో 41 ఓవర్లకు గాను ఇంగ్లండ్ స్కోర్ 225/4గా
ఉంది. కుల్‌దీప్ బౌలింగ్ లోనే బెన్ డకెట్(153) కూడా ఔట్ కావడంతో భారత్ కు ఐదో
వికెట్ దక్కింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ 445 పరుగులకు ఆలౌటైంది.
ప్రస్తుతం ఇంగ్లండ్, 155 పరుగుల వెనుకంజలో ఉంది.