రైళ్లు ఢీ కొట్టుకోకుండా స్వదేశీ తయారీ యాంటీ కొలిజన్ డివైస్ కవచ్‌ను వందేభారత్ రైలులో విజయవంతంగా ప్రయోగించారు. గంటకు 160 కి.మీ వేగంలో కూడా ఈ కవచ్ విజయవంతంగా పనిచేసింది. 8 బోగీలున్న వందేభారత్ రైలులో (vandebharat train kavach test) కవచ్ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసింది.యూపీలోని మథుర, పాల్వాల్ మధ్య ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
రైళ్లు ఢీ కొట్టుకోకుండా నిరోధించే కవచ్‌ను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. లోకోపైలెట్ పొరపొటున బ్రేకులు వేయకుంటే వెంటనే కవచ్ రంగంలోకి దిగి రైలును ఆపుతుంది.ప్రయోగంలో వందేభారత్ రైలును 160 కి.మీ వేగంతో నడిపారు. లోకో పైలెట్ బ్రేకులు వేయలేదు. కవచ్ ఆటోమేటిగ్గా వందేభారత్ రైలును నిలిపివేసింది. ఈ వ్యవస్థను దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల వెంట అమలు చేయడానికి ఆర్‌ఎఫ్ఐడీ ట్యాగులు, కవచ్ టవర్లు అవసరం ఉంటుంది. వీటిని దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ (bharatiya railways) సిద్దం అవుతోంది.