రాజ్
కోట్ వేదికగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్, రెండో రోజ ఆట
ముగిసింది. ఐదు వికెట్ల నష్టంతో 326 పరుగులు చేసి రెండో రోజు ఆట ప్రారంభించిన
భారత్, 445 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆటముగిసే సమయానికి
ఇంగ్లండ్ 35 ఓవర్లకు రెండు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. క్రీజులో బెన్
డకెట్(133), రూట్(9) ఉన్నారు.
ఇంగ్లండ్
ఇన్నింగ్స్ ను జాక్ క్రాలే, బెన్ డకెట్ ప్రారంభించగా తొలి ఓవర్ బుమ్రా వేశాడు. జాక్
క్రాలే(15)ను పెవిలియన్ కు పంపడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ నష్టపోయింది. 13 ఓవర్లు
ముగిసే సరికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. బెన్ డకెట్ 88
బంతుల్లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో డకెట్ కు ఇది మూడో సెంచరీ. సిరాజ్ వేసిన
29.6 బంతికి ఒలీపోప్ (39) ఔట్ అయ్యాడు. పోప్, డకెట్ కలిసి రెండో వికెట్ కు 93
పరుగులు జోడించారు. భారత బౌలర్లు అశ్విన్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.
భారత్
ఆటగాళ్ళలో రోహిత్ శర్మ(131). జడేజా(112), సర్ఫరాజ్ (62), ధ్రువ్ జురెల్(46),
అశ్విన్(37) రాణించారు. బుమ్రా 26 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో భారత్ 5
వికెట్లు నష్టపోయి 119 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ నాలుగు,
రెహాన్ అహ్మద్ రెండు, అండర్సన్, టామ్ హార్ట్ లీ, జో రూట్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు అంపైర్ 5 పరుగులు
జరిమానా విధించడంతో ఇంగ్లండ్ 5/0 తో ఇన్నింగ్స్ ప్రారంభించింది.