భారత
క్రికెట్ స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో మూడువేల పరుగులు చేయడంతో పాటు
బౌలింగ్ లో 250 కంటే ఎక్కువ వికెట్లు సాధించిన మూడో భారత క్రికెటర్ గా రికార్డు
నెలకొల్పాడు. కెరియర్ లో 70 వ టెస్టు ఆడుతున్న జడేజా, తన ఖాతాలో 3,005 పరుగులు, 280 వికెట్లు
తన ఖాతాలో వేసుకున్నాడు.
2012
నుంచి టెస్టు మ్యాచులు ఆడుతున్న జడేజా, 2019 నుంచి తన ప్రదర్శనను మరింత మెరుగు
పరుచుకున్నాడు. 2109 నుంచి 30 టెస్టుల్లో 44.47 సగటుతో 1601 పరుగులు చేశాడు. 26.67
సగటుతో 90 వికెట్లు తీశాడు. స్వదేశంలో ఆడిన మ్యాచుల్లో మరింత రాణించాడు. 2019
నుంచి భారత్ వేదికగా 14 టెస్టులు ఆడిన జడేజా, 871 పరుగులు సాధించాడు.
భారత
ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అరుదైన
రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో 500 వికెట్లు
సాధించాడు. రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్ తో
జరుగుతున్న మూడో టెస్టులో ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలీ(15)ని పెవిలియన్ కు పంపి 500 వికెట్ల
క్లబ్ లో చేరాడు.
లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో
బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.
కుంబ్లే 105 టెస్టులు
ఆడి 500 వికెట్లు తీయగా అశ్విన్ 98 టెస్టుల్లోనే ఈ ఘనత
సాధించాడు. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 87 టెస్టుల్లోనే
500 వికెట్ల తీసి ఈ జాబితాలో టాప్ లో ఉన్నాడు.