Chandrababu Naidu starts performing Raja Syamala Yagam
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది.
యాగంలో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా
కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు,
భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది ఋత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. రాజశ్యామల యాగంలో భాగంగా
మూడు రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఆదివారం
పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.
రాజ్యాధికారం సాధించడం కోసం రాజశ్యామల
యాగం చేస్తారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఎన్నికల ముందు
ప్రతీసారీ ఈ యాగం చేయించుకునేవారు.