పశ్చిమబెంగాల్ లోని
సందేశ్‌ఖాలీలో మహిళలపై తృణమూల్ నేతలు, గుండాల లైంగిక వేధింపులు, భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణల అంశం సుప్రీంకోర్టు
దృష్టికి వెళ్ళింది. దీనిపై దాఖలైన పిల్ ను విచారించే అంశాన్నిి
పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
సందేశ్
ఖాలీ వివాదంపై సీబీఐ లేదా సిట్‌తో కోర్టు
పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలంటూ గురువారం ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
సందేశ్‌ఖాలీ బాధితులకు పరిహారం, విధి
నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ శ్రీ వాస్తవ
కోరారు. కేసు దర్యాప్తు, విచారణను పశ్చిమబెంగాల్ ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని పిటిషన్
లో పేర్కొన్నారు. మణిపుర్ అల్లర్లపై దర్యాప్తు చేపట్టినట్లే.. త్రిసభ్య
ధర్మాసనంతో విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశాన్ని
పరిశీలిస్తామని భారత ప్రధానన్యాయమూర్తి తెలిపారు.
సందేశ్‌ఖాలీలో
మహిళలపై లైంగిక దాడుల అంశం పశ్చిమబెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్‌ఖాలీలో
టీఎంసీ నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఈడీ
అధికారులపై దాడికి పాల్పడిన కేసులో షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. షాజ్‌హాన్
అరాచకాలపై చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని మహిళలు ఆందోళనకు దిగారు. ఈ అంశాన్ని
ఇప్పటికే కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.