ఎన్డీయే
హ్యాట్రిక్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ చేస్తోన్న ప్రయత్నాలు ఆ పార్టీకే చేటు
చేస్తున్నాయి. ఇండీకూటమిలోని పార్టీల మధ్య సయోధ్యలేకపోవడంతో పాటు కాంగ్రెస్
పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి.
పరిస్థితి ఇలానే కొనసాగితే ఎన్నికల నాటికి కూటమిలో కాంగ్రెస్ ఒక్కటే మిగిలినా
ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
జమ్ము-కశ్మీర్
కేంద్రంగా రాజకీయాలు చేస్తోన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, సొంతంగానే పోటీ చేసేందుకు
సిద్ధమైంది. ఎన్సీ అధినేత ఫరూక్ అబ్ధుల్లా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
కూటమితో సంబంధం లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు
వెళతామని స్పష్టం చేశారు.
ఇండీకూటమితో
తెగతెంపులు చేసుకున్నట్లు ఫరూక్ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఆయన కుమారుడు ఒమర్ స్పందించారు.
ఇండీకూటమిలోనే ఉంటామని వివరణ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల సర్ధుబాటుపై
భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయన్నారు. జమ్ము-కశ్మీర్ లో పీఏజీడీ కూటమిలో
ఎన్సీ ప్రధాన పాత్రధారిగా ఉంది.
ఇటీవల
జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండీ కూటమిలో పొరపొచ్చాలు
బయటపడ్డాయ. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా
పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ
ఎన్నికల్లో సీపీఎం కూడా ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడింది. కాంగ్రెస్, సీపీఐతో మాత్రమే పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి కేవలం
ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే కేటాయించింది.
ఇక
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ కూడా సొంతంగా పోటీ చేయాలనే నిర్ణయానికి
వచ్చారు. కాంగ్రెస్ తో సావాసం చేస్తే అసలుకే మోసం వస్తుందనే ఉద్దేశంతో జేడీయూ
అధినేత నితీశ్ కూడా ఇండీ కూటమికి బైబై చెప్పి ఎన్డీయేలో చేరారు.