జ్యోతిర్లింగం,
శక్తిపీఠమైన శ్రీగిరి క్షేత్రంలో నేడు ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు ఈ నెల 21 వరకు జరుగుతాయి.
ప్రధానాలయంలోని
శివాజీ గోపుర పునర్నిర్మాణం, ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల
పునరుద్ధరణ, క్షేత్ర పరిధిలోని ఉపాలయాల్లో శివలింగం, నందీశ్వర ప్రతిష్ఠ సందర్భంగా
మహాకుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మహాకుంభాభిషేకం
సందర్భంగా ఫిబ్రవరి 21న శాంతి హోమం, పౌష్టిక హోమం, మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.
ఉదయం 8.45 గంటల నుంచి ఆలయాలలో యంత్ర ప్రతిష్ఠ, శివలింగ నందీశ్వర ప్రతిష్ఠ, శివాజీ
గోపురానికి సువర్ణ కలశ ప్రతిష్ఠ జరుగుతుంది.
రాజ్యసభ
సభ్యుడు, వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతులు శ్రీశైలేశుడికి
స్వర్ణ రథాన్ని కానుకగా అందజేశారు. రథసప్తమి సందర్భంగా స్వామికి అందజేశారు. 23.6
అడుగుల ఎత్తుతో స్వర్ణ తాపడం చేయించిన ఈ
రథంలో పార్వతీ పరమేశ్వరులతో పాటు గణపతి, కుమారస్వామి కూడా కొలువుదీరారు.
ఇప్పటివరకు
ఆదిదంపతులు పర్వదినాల్లో వెండిరథంపైనే విహరిస్తుండగా, ప్రస్తుతం స్వర్ణరథం
సమకూరింది. ప్రత్యేక ఉత్సవాల్లో దీనిపైనే ఇకనుంచి విహరించనున్నారు. సుమారు రూ. 11
కోట్ల వ్యయంతో దీనిని తయారు చేయించారు.