Bharat lost two wickets in the very begining of second day match
రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో
టెస్టులో భారత్ రెండో రోజు ఆట మొదలుపెట్టింది. ప్రారంభంలోనే రెండు వికెట్లు
కోల్పోయింది.
5 వికెట్ల నష్టానికి 326 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో భారత్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో
రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఆట మొదలైన కొద్దిసేపటికే కులదీప్ యాదవ్ ఆండర్సన్
బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. 331 పరుగుల వద్ద 6వ వికెట్‌గా ఔటయ్యాడు. ఆ వెంటనే
జో రూట్ రవీంద్ర జడేజాను ఔట్ చేసాడు. తన బౌలింగ్‌లో తనే క్యాచ్ పట్టి రవీంద్ర
జడేజాను పెవిలియన్ దారి పట్టించాడు. అప్పటికీ స్కోరు ఇంకా 331 దగ్గరే ఉంది.
ఇప్పుడు ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ ఆట
కొనసాగిస్తున్నారు. మొదటిరోజులాగే రెండో రోజు కూడా ఆట మొదలైన వెంటనే రెండు
వికెట్లు పడిపోవడంతో ఇద్దరూ జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్నారు.
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌లో ఇది మూడవది.
ఇప్పటికి రెండు జట్లూ చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి.