నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వారసులు ఎవరనే విషయంలో శరద్ పవార్
కు ఎదురుదెబ్బ తగిలింది. అజిత్ పవార్ నేతృత్వం వహిస్తోన్న వర్గమే అసలైన ఎన్సీపీ
అంటూ మహారాష్ట్ర శాసన సభాపతి రాహుల్ నార్వేకర్ తెలిపారు. ఎన్సీపీకి చెందిన
మెజార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది అజిత్ వర్గంలో ఉన్నందున వారిపై అనర్హత వేటు వేయలేమని తేల్చి చెప్పారు.
ఎన్సీపీ నుంచి శాసససభకు 53 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక అవ్వగా అందులో అజిత్ పవార్ వర్గంలో 41 మంది ఉన్నారు.
కేవలం 12 మంది మాత్రమే ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ వెంట ఉన్నారు. దీంతో
అజిత్ పవార్ వర్గాన్ని అనర్హులుగా తేల్చడం కుదరదని నార్వేకర్ స్పష్టం చేశారు.
స్పీకర్
ప్రకటనపై శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. గతంలో శివసేన విషయంలో ఇచ్చిన ఆదేశాలను ఎన్సీపీ విషయంలో
పాటించారని ఎద్దేవా చేశారు. స్పీకర్ నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమంటు నిష్ఠూరమాడారు.