తిరుపతి జూలో ఘోరం జరిగింది. లయన్ ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించిన వ్యక్తిపై సింహం దాడి చేసి చంపేసింది. అతడి తలను పూర్తిగా తినేయడంతో గుర్తించడం కష్టంగా మారింది. దాడికి పాల్పడిన సింహాన్ని అధికారులు బంధించారు. అధికారుల కథనం ప్రకారం.
ఈ ఘటన ప్రమాద వశాత్తూ జరిగిందా, సందర్శకుడు కావాలనే సింహంతో ఫోటోలు దిగేందుకు దగ్గరకు వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సందర్శకుడు ఎవరు అనేది కూడా తేలాల్సి ఉంది.