అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సాగుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళుతున్నాయి. మూడో రోజు కూడా స్టాక్ సూచీలు లాభాలార్జించాయి. పెట్టుబడిదారుల నుంచి కొనుగోళ్లకు మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
ప్రారంభం నుంచి రోజంతా మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నా సాయంత్రానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 72050 వద్ద ముగిసింది. నిఫ్టీ 70 పాయింట్లు లాభ పడింది. నిఫ్టీ 21910 పాయింట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బిఐ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలార్జించాయి. ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర స్వలంగా దిగి వచ్చింది. బ్యారెల్ ముడి చమురు 81.24 డాలర్లకు తగ్గింది. బంగారం ధరలు (gold rate) కూడా తగ్గాయి. ఔన్సు బంగారం (ounce gold price) 2007 డాలర్లకు తగ్గింది. డాలరుతో రూపాయి విలువ 83.04 వద్ద ట్రేడవుతోంది.