సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం సిద్దమవుతోంది. లోక్‌సభతోపాటు, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికలకు 3.40 లక్షల కేంద్ర బలగాలు (crpf) అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా పలు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం అవసరాల మేరకు 3400 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించనున్నట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు.దశల వారీగా ఎన్నికలు జరగనుండటంతో బలగాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తలించనున్నారు.
కేంద్ర బలగాలను మోహరించేందుకు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారుల సూచనల మేరకు పంపించడం జరుగుతుంది. ఈవీఎంలకు రక్షణ కల్పించడం, ఓటర్లలో భయం లేకుండా చేయడం, ఎన్నికలకు అడ్డుపడే శక్తులను అణచివేయడంలాంటి విధులను కేంద్ర బలగాలు నిర్వహించనున్నాయి. రాబోయే రెండు మాసాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 98 కోట్ల మంది ఓటర్లు పాల్గొనున్నారు.
కేంద్ర బలగాల్లో 920 బెటాలియన్లను పశ్చిమబెంగాల్, 635 జమ్ము, కశ్మిర్‌లకు కేటాయించారు. మరో 360 కంపెనీలు ఛత్తీస్‌గఢ్‌కు, 295 బిహార్‌కు, ఉత్తరప్రదేశ్‌కు 252 కంపెనీలు, మరో 250 కంపెనీలు ఏపీకి కేటాయించారు. పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెరి 200 కంపెనీలు, మణిపుర్, రాజస్థాన్, తమిళనాడులకు 175 కంపెనీల చొప్పుల కేంద్ర బలగాలను కేటాయించారు.
ఏప్రిల్‌లో మొదలయ్యే ఎన్నికలు మే చివరి నాటికి ముగియనున్నాయి. 543 లోక్‌సభ ఎంపీలను ప్రజలు ఎన్నుకోనున్నారు. ఎన్డీయే కూటమికి ఇప్పటికే 370 మంది సభ్యుల బలం ఉండగా, వచ్చే ఎన్నికల్లో 400పైగా సీట్లు సాధించాలని యోచిస్తోంది.