గుంటూరు జిల్లా తెనాలిలో అరాచకం జరిగింది.తెనాలి భవనంవారి వీధిలో నిద్రిస్తోన్న మహిళ పీక కోసి (crime news) చంపేశారు. పోలీసుల కథనం ప్రకారం. భవనం వారి వీధిలో రామిశెట్టి అలేఖ్య భర్తతో కలసి నివశిస్తోంది. గురువారం ఉదయాన్నే భార్య అలేఖ్య చనిపోయి ఉండటాన్ని గుర్తించిన భర్త రమేశ్ పోలీసులకు సమాచారం అందించాడు.
అన్నెం శ్రీనివాస్ కొన్నాళ్లుగా తన భార్య అలేఖ్యను వేధిస్తున్నాడని రమేశ్ తెలిపారు. శ్రీనివాస్ వేధింపులపై కేసు కూడా నమోదై ఉంది. ఆ కేసులో శిక్ష పడుతుందని తెలియడంతో, అలేఖ్య గొంతుకోసి చంపాడని రమేశ్ పోలీసులకు తెలిపాడు.
గురువారం తెల్లవారుఝామున హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పదునైన ఆయుధంతో అలేఖ్య గొంతుకోయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.