వారం కిందట అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో ఉత్తరాఖండ్లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బంభూల్పురా పట్టణంలో హింసను (uttarakhankd violence ) అదుపు చేసేందుకు పోలీసు అధికారులు గత బుధవారం కర్ఫ్యూ విధించారు. పరిస్థితులు క్రమంగా అదుపులోకి రావడంతో ఇవాళ కర్ఫ్యూ సడలించారు. నైనిటాల్ జిల్లా కలెక్టర్ వందనాసింగ్ ఉత్తర్వుల మేరకు గౌజాజలి, రైల్వే బజార్, ఎఫ్సీఐ గోడౌన్ ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 4 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. బన్భూల్పురాలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు.
ఫిబ్రవరి 8న బంభూల్పురా ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేసిన సమయంలో హింస చెలరేగింది. అధికారులపై కొందరు రాళ్లు రువ్వారు. పెట్రోల్ బాంబులు వేశారు. పోలీసు స్టేషన్కు నిప్పు పెట్టారు. హింసను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మీడియా ప్రతినిధులు సహా 100పైగా గాయపడ్డారు.