ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP EAPCET షెడ్యూల్
విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ సహా ఇతర కోర్సుల్లో
చేరేందుకు గాను ఈ ప్రవేశ పరీక్షను ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి
ప్రవేశ పరీక్షను జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో మే 13 నుంచి 19వరకు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి
నిర్ణయించింది.
AP ECET,I CET, EDCET సహా మరో
ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది.
ఐసెట్ ను శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ, అనంతపురం
నిర్వహిస్తోండగా ప్రవేశపరీక్ష మే 6న నిర్వహించాలని నిర్ణయించారు. ఈసెట్ జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో మే 8న
జరగనుంది.
పీజీఈసెట్ మే 29 నుంచి 31 వరకు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి ఆధ్వర్యంలో జరగనుంది.
ఆంధ్రా
వర్సిటీ, ఎడ్‌సెట్‌ను జూన్ 8న నిర్వహించనుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఆధ్వర్యంలో లాసెట్ జూన్ 9న నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి
పేర్కొంది. పీజీసెట్ ను జూన్ 3 నుంచి 7 వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఏడీసెట్ ను
జూన్ 13న డా. Ysr ఆర్కిటెక్చర్ వర్సిటీ కడప నిర్వహించనుంది.