కేంద్ర ప్రభుత్వ సర్వీసుల కోసం సన్నద్ధమవుతున్న
ఉద్యోగార్థులకు యూపీఎస్సీ సివిల్స్ శుభవార్త చెప్పింది. యూపీఎస్సీ సివిల్
సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2024 దరఖాస్తుల రిజిస్ట్రేషన్ నేడు (ఫిబ్రవరి 14, 2024)
ప్రారంభమైంది.
మార్చి 5, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు upsc.gov.in,
upsconline.nic.in వెబ్సైట్లలో లాగిన్ అయి ఆన్లైన్లో దరఖాస్తు అందజేయాల్సి
ఉంటుంది.
కేంద్రం/ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
లేదా సమానమైన కోర్సు పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జనరల్
అభ్యర్థులు గరిష్ఠంగా ఆరుసార్లు పరీక్ష రాసేందుకు అవకాశం ఉండగా రిజర్వేషన్, వికలాంగ
అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ ఆశావహులకు ఎలాంటి
పరిమితిలేదు. ఓబీసీ అభ్యర్థులు 9 సార్లు ప్రయత్నించిందుకు అవకాశం ఉంది.
కనీస వయస్సు 21 సంవత్సరాలు కాగా, ఆగస్టు 1, 2023 నాటికి 32సంవత్సరాలు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, కేటగిరీలను బట్టి సడలింపు
ఉంటుంది.