వరుస
ఓటములతో కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. దివంగత ప్రధాని
లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి, కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖను అందజేశారు.
ఏక వాక్య
లేఖతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. దానినే సోషల్ మీడియాలో
పోస్టు చేశారు.
కాంగ్రెస్
వీడిన వెంటనే విభాకర్ శాస్త్రి, బీజేపీలో చేరారు. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి
బ్రజేశ్ పాఠక్ సమక్షంలోకాషాయ కండువా మెడలో వేసుకున్నారు.
తన
తాత లాల్ బహదూర్ శాస్త్రి, దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందు బీజేపీలో చేరినట్లు
చెప్పిన విభాకర్ శాస్త్రి, ఇండీ కూటమికి ఎలాంటి సిద్ధాంతం లేదన్నారు. కేవలం మోదీని
ప్రధాని పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా పెట్టుకుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్
సిద్ధాంతం ఏంటో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు.
తనను బీజేపీలోకి ఆహ్వానించిన
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం
బ్రజేశ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే
మహారాష్ట్ర కాంగ్రెస్ కు మాజీ సీఎం అశోక్ చవాన్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బాబా
సిద్ధిఖీ కూడా ఇటీవల కాంగ్రెస్ ను వీడారు.