వసంత
పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మవారు వాగ్దేవీగా
దర్శనమిచ్చారు. మహామండపం 6వ అంతస్తు లో అమ్మవారి ఉత్సవమూర్తి
శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇచ్చారు.
శ్రీ
పంచమి సందర్భంగా సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి మూల విరాట్ వద్ద
శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు పెన్ను, అమ్మవారి ఫొటో, రక్షా, కుంకుమ, లడ్డూ ప్రసాదం
ఉచితంగా అందజేశారు. అనంతరం విద్యార్థులు ముఖమండపం ద్వారా అమ్మవారిని
దర్శించుకున్నారు.
శ్రీ
పంచమి సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో
ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి
తగ్గట్టుగా ఆలయ పాలకమండలి తగిన ఏర్పాట్లు చేసింది.
చదువుల
తల్లి సరస్వతీదేవి పుట్టినరోజైన వసంత పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన
కనకదుర్గమ్మ, జ్ఞానస్వరూపిణిగా దర్శనమిస్తారు. విద్యార్థల కోసం ప్రత్యేక పూజలు
నిర్వహించడం ఆనవాయితీ.