BJP second list for Rajya Sabha Polls
త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు
భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల చేసింది. కేంద్రమంత్రి ఎల్
మురుగన్, మాయా నరోల్యా, బన్సీలాల్ గుర్జర్, ఉమేష్‌నాథ్ మహరాజ్‌లను మధ్యప్రదేశ్ నుంచి
ఎన్నికల బరిలో మోహరించింది. కేంద్రమంత్రి అశ్వినీవైష్ణవ్ ఒడిషా నుంచి పోటీ
చేస్తారు. ఆయనకు బీజేడీ మద్దతిచ్చే అవకాశాలున్నాయి.
అంతకుముందు, ఆదివారం నాడు బీజేపీ తమ పార్టీ
అభ్యర్ధుల మొదటి జాబితాను ప్రకటించింది. బిహార్ నుంచి ధర్మశీల గుప్తా, భీమ్‌సింగ్‌లను,
ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్‌ను ప్రకటించింది. హర్యానా నుంచి
సుభాష్ బరాలా, కర్ణాటక నుంచి నారాయణ కృషనాశ భండగే, ఉత్తరాఖండ్ నుంచి మహేంద్రభట్,
పశ్చిమబెంగాల్ నుంచి సమిక్ భట్టాచార్యలను రాజ్యసభ బరిలోకి దింపుతోంది.
ఆర్‌పిఎన్ సింగ్, సుధాంశు త్రివేది, చౌధరి తేజ్‌వీర్
సింగ్, సద్నా సింగ్, అమర్‌పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, నవీన్ జైన్ ఉత్తరప్రదేశ్‌నుంచి
పోటీ పడతారు.
ఈ యేడాది మే నెల మొదటివారంలో మొత్తం 58మంది
రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. వారిలో ఎనిమిది మంది కేంద్రమంత్రులు, మాజీ
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
ఆ ఎనిమిది మంది కేంద్రమంత్రులూ ఎవరంటే మన్‌సుఖ్
మాండవీయ, భూపీందర్ యాదవ్, పర్షోత్తమ్ రూపాలా, ధర్మేంద్ర ప్రధాన్, వి మురళీధరన్,
నారాయణ రాణే, రాజీవ్ చంద్రశేఖర్, అశ్వినీ వైష్ణవ్.
రిటైర్ అవుతున్న వారిలో 28మంది బీజేపీ ఎంపీలు, 11మంది కాంగ్రెస్
ఎంపీలు, 4గురు తృణమూల్ కాంగ్రెస్, 4గురు భారత రాష్ట్ర సమితి, 2 బీజేడీ, 2 ఆర్‌జేడీ,
2 జేడీయూ, 1 వైసీపీ, 1 శివసేన, 1 ఎన్‌సీపీ, 1 టీడీపీ, 1 సిక్కిం డెమొక్రటిక్
ఫ్రంట్‌లకు చెందిన వారు.
రాజ్యసభలో మొత్తం 239 స్థానాలున్నాయి, వాటిలో 6
ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. బీజేపీకి రాజ్యసభలో 93మంది ఎంపీలు ఉన్నారు. 30మంది
కాంగ్రెస్, 13మంది తృణమూల్ కాంగ్రెస్, 6 నామినేటెడ్ సభ్యులు ఉన్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు