తిరుపతి శేషాచల ప్రాంతంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామి వార్షిక
బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 29న
బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.
బ్రహ్మోత్సవాల
సందర్భంగా ప్రతీరోజూ ఉదయం 7 నుంచి
9 గంటల వరకు, రాత్రి 7
నుంచి 9 గంటల వరకు స్వామివార్లకు వాహనసేవలు నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో
భాగంగా ప్రతీరోజూ కోలాటాలు,
భజన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మార్చి 1న ధ్వజారోహణ నిర్వహించి రాత్రికి హంస వాహనంపై ఊరేగిస్తారు. మార్చి2న ఉదయం,
సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల
మూడో రోజున భూత వాహనం, సింహ వాహనంపై స్వామివారు విహరించనున్నారు.
మరుసటి
రోజు (మార్చి4న ) మకర వాహనం, శేష వాహనంపై నుంచి భక్తులను కటాక్షిస్తారు. మార్చి 5న
ఉదయం వేళ తిరుచ్చి ఉత్సవం నిర్వహించి రాత్రికి అధికారనంది వాహనం సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. మార్చి
6న ఉదయం, వ్యాఘ్ర వాహనంపై
నుంచి భక్తులను కటాక్షిస్తారు, అదే రోజు రాత్రికి గజ వాహనంపై మాఢవీధుల్లో విహరిస్తారు.
మార్చి
7న ఉదయం కల్పవాహనసేవ, రాత్రి అశ్వ వాహన సేవ నిర్వహించి విశేష పూజలు
నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ పర్వదినాల్లో భాగంగా మార్చి8న రథోత్సవం నిర్వహించి
రాత్రికి నందివాహనం సేవలో స్వామిని కొలుస్తారు. మార్చి 9న ఉదయం పురుషామృగవాహనం,
సాయంత్రం కళ్యాణోత్సవం, రాత్రికి తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు.
మార్చి10న త్రిశూలస్నానం
సాయంత్రం నిర్వహించి, సాయంత్రం ధ్వజావరోహణం చేస్తారు. రాత్రికి రావణాసుర వాహనంపై
నుంచి భక్తులను అనుగ్రహిస్తారు.