మేడారం జాతర సందర్భంగా నేటి నుంచి గురువారం
వేకువజాము వరకూ మండమెలిగే పూజలు జరుగుతాయి. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి
సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయలో పగిడిద్ద రాజు,
గోవిందరాజు ఆలయాల్లో పూజలు ఉదయం పూజలు జరిగాయి.
గతంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి
పాతబడేవి. పూజారులు అడవికి వెళ్ళి చెట్టుకొమ్మలు, వాసాలు, గడ్డి తీసుకొచ్చి
కొత్త గుడిని నిర్మించి పండుగ జరుపుకునే వారు. దీనినే మండమెలిగే కార్యక్రమం
అంటారు. పగలంతా పనిచేసిన పూజారులు రాత్రికి అడవిలో దేవతల గద్దె
పై జాగరం చేసేవారు.
మేడారం ప్రసాదాన్ని భక్తులకు ఇంటి వద్దే అందజేయాలని
టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. https://rb.gy/q5rj68 ద్వారా గానీ, టీఎస్ఆర్టీసీ కార్గో/లాజిస్టిక్స్ కౌంటర్లలో రూ.299
చెల్లించి ప్రసాదాన్ని ముందుగా బుక్ చేసుకోవచ్చు. పేటీఎం ఇన్ సైడర్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ
వీసీ సజ్జనార్ తెలిపారు.