పశ్చిమ
బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, వారి భూములను ఆక్రమణ ఆరోపణలపై కలకత్తా
హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా
సుమోటోగా విచారణకు స్వీకరించింది.
మీడియాలో
వచ్చిన కథనాలు తనను కలవరపాటుకు గురిచేశాయన్న
జస్టిస్ అపుర్బ సిన్హా రాయ్,
రాష్ట్ర
ప్రభుత్వం, పోలీసు
ఉన్నతాధికారులతో పాటు ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు
జారీ చేశారు. ఈ నెల 20న హైకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది.
సందేశ్‌ఖాలీ వద్ద ఆంక్షలను ఎత్తేయాలంటూ
జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ ఇద్దరు స్థానికులు హైకోర్టులో పిటిషన్
దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ జయ్సేన్గుప్తా.. నిషేధాజ్ఞలు అమలు
చేసిన విధానం సరికాదన్నారు.
జాతీయ
ఎస్టీ కమిషన్ సైతం ఈ ఘటనను సుమోటోగా
విచారణకు స్వీకరించింది. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక అందజేయాలని పోలీసులను
ఆదేశించింది.